బ్రేకింగ్ న్యూస్: తల్లి కాబోతున్న సాయి పల్లవి

sai pallavi

హైబ్రీడ్ పిల్ల భానుమతి గుర్తుంది కదా ! తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని ఫిద చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ మరోసారి ప్రేక్షకులను ఫిదా చెయ్యడానికి వస్తోంది. ఈసారి ఆమె కనిపించబోయే పాత్ర కుడా డిఫ్రెంట్ గా ఉండడంతో ఆ సినిమా మీద భారీ అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ‘కణం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా విజయ్ దర్శకత్వంలో ‘కణం’ మూవీ తెరకెక్కుతుంది. ‘2.0’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేస్తోంది.

నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌‌లు ‘కణం’చిత్రానికి పనిచేస్తున్నారు.

హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నది. తమిళ్‌లో కరు టైటిల్‌తో రిలీజ్ కానుంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంతో సాయిపల్లవి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో కణం తెరకెక్కుతున్నది. ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో నటిస్తోందట. సాయిపల్లవి, నానితో కలిసి ఎంసీఏ సినిమాలో కూడా నటిస్తోంది. ఎంసీఏ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.

Leave a comment