మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో

sai dharam tej winner teaser review

Sai Dharam Tej’s latest movie Winner teaser is released and it is getting huge reponse from all over.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలో ఒకే తరహా మాస్ గెటప్‌లో కనిపించాడు. సినిమా సినిమాకి పెద్దగా వేరియేషన్ ఏమీ చూపించలేదు. కానీ.. తొలిసారి మనోడు రూట్ మార్చాడు. తన కొత్త సినిమా ‘విన్నర్’ కోసం ఒరిజినల్‌ని అలాగే మెయింటెయిన్ చేస్తూ.. కాస్త క్లాస్ మిక్స్ చేశాడు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్ అవతారంలో కనువిందు చేశాడు. డైలాగులు చెప్పే టైంలో అతని ఇంటెన్సిటీని మెచ్చుకోలేక ఉండలేరు.

ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌లో స్టోరీలైన్‌ని రివీల్ చేయలేదు కానీ.. దాదాపు అన్ని ప్రధాన పాత్రల్ని రివీల్ చేశారు. జగపతిబాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, కమెడియన్ ఆలీ, ముకేష్ రిషి ఈ టీజర్‌లో కనిపించారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పట్లాగే అందంగా మెరిసింది. యాంకర్ అనసూయ కూడా ఓ ఫ్రేమ్‌లో హోయలు ఒలుకుతూ తళుక్కుమంది. చూస్తుంటే.. ఈ అమ్మడు ఈసారి ఆడియెన్స్‌ని తన అందాల ఆరబోతతో మత్తెక్కించడం ఖాయంలా కనిపిస్తోంది. ఇక యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

టెక్నికల్ పరంగా చూస్తే.. గోపీచంద్ మలినేని టేకింగ్ అదుర్స్ అనిపించేలా ఉంది. అలాగే ఛోటా సినిమాటోగ్రఫీ, నిర్మాతల నిర్మాణ విలువలు, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా.. ఈ టీజర్ చాలా బాగుంది.

Leave a comment