Moviesసాహూ 14 డేస్ కలెక్షన్స్.. బ‌య్య‌ర్లలో ఆందోళన..?

సాహూ 14 డేస్ కలెక్షన్స్.. బ‌య్య‌ర్లలో ఆందోళన..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో దక్షిణాది బ‌య్య‌ర్ల‌ను నిలువునా ముంచేశారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా థియేటర్ లోకి వచ్చి రెండు వారాలు పూర్తయింది.కేవలం ఒకే ఒక అనుభవం డైరెక్టర్ ఉన్న డైరెక్ట‌ర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 333 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా రెండు వారాల్లో సాహో వరల్డ్ వైడ్‌గా 424 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం రికార్డులను సైతం సాహో బద్దలు కొట్టేస్తుందని అందరూ అనుకుంటే… చివరకు రూ. 90 కోట్ల షేర్ కూడా లేని పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి తీసేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే సాహో రూ. 170 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూస్తే వాళ్లు నిండా మునిగి పోవడం ఖాయం గా కనిపిస్తోంది. హిందీలో మాత్రం సాహో 120 కోట్ల షేర్ కాబట్టి ప్రాఫిట్ వెంచ‌ర్ అనిపించుకుంది. సౌత్ లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు క‌ర్నాట‌క‌ తమిళనాడు, కేరళలో ఈ సినిమాను పట్టించుకునేవారే లేరు.

తమిళనాడు, కేరళలో అయితే సాహో డిజాస్టర్ అయ్యింది. అక్క‌డ క‌నీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక సాహో చతికిల‌ప‌డింది. ఇక తెలుగులోనే సాహో రూ.50 కోట్ల మేర‌కు బ‌య్య‌ర్ల‌ను ముంచ‌డం ఖారారైంది. మ‌రి ఈ మొత్తాన్ని యూవీ క్రియేష‌న్స్ వాళ్లు భ‌రించ‌క త‌ప్ప‌దు. కొంత‌లో కొంత బ‌యర్ల మీద తోసేసినా మిగిలింది వాళ్లు రిక‌వ‌రీ చేయాల్సిందే. ఏదేమైనా సాహో దెబ్బ‌తో యూవీ వాళ్ల‌తో పాటు ఆ సినిమా కొన్న బ‌య్య‌ర్లు కూడా నిండా మునిగిపోయారు.

తొలి వారంలోనే ఫ్లాప్‌ కన్‌ఫర్మ్‌ అయిన సాహో రెండవ వారంతో భారీ నష్టాలని ఖాయం చేసుకుంది. సినిమాకు రెండో రోజు నుంచే వ‌సూళ్లు లేక‌పోయినా మేక‌ర్స్ మాత్రం ఏకంగా రూ.424 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ని ఈ ప్లాప్ సినిమాకు పోస్ట‌ర్లు రిలీజ్ చేసుకుంటూ హంగామా చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఎవ‌రిని ఫూల్స్ చేయ‌డానికో వాళ్ల‌కే తెలియాలి.

91

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news