Moviesనానీ 'గ్యాంగ్ లీడర్' రివ్యూ & రేటింగ్

నానీ ‘గ్యాంగ్ లీడర్’ రివ్యూ & రేటింగ్

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. లక్ష్మి, శరణ్య వంటి సీనియర్ స్టార్స్ కూడా సినిమాలో నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఓ బ్యాంక్ రాబరీలో పాల్గొన్న ఆరుగురులో ఒకడు మిగతా ఐదుగురిని చంపేస్తాడు. ఆ ఐదుగురికి సంబందించిన ఐదుగురు లేడీస్ ఆ ఆరో వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఫేమస్ రివెంజ్ స్టోరీ రైటర్ అయిన రివెంజ్ పార్థసారధిని కలుస్తారు. ఆ ఐదుగురు లేడీస్ కోసం పెన్సిల్ పార్ధసారధి ఆ ఆరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతను రాసే కథ.. బయట జరిగే పరిస్థితులు ఒకేలా ఉంటాయి. ఇంతకీ పెన్సిల్ పార్ధసారధి ఆ ఆరో వ్యక్తిని పట్టుకున్నాడా..? ఇంతకీ అసలీ ఆడవాళ్ల రివెంజ్ స్టోరీ ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

ఎప్పటిలానే నాని నాచురల్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. రివెంజ్ స్టోరీ రైటర్ గా పెన్సిల్ పార్ధసారధిగా నాని అదరగొట్టాడు. తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని కళల్లో అదరగొట్టాడు నాని. ఇక సినిమాలో ప్రియాంకా హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా బాగానే చేసింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కామెడీ మెప్పించింది. సినిమాలో విలన్ గా నటించిన కార్తికేయ సూపర్ అనిపించాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా అతనికి మంచి కెరియర్ ఉందనిపిస్తుంది. మిగతా నటీనటులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా ఉంటుంది. ఇక అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో అసెట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి మూవీస్ టేస్ట్ ను తెలియచేస్తున్నాయి. దర్శకుడు విక్రం కె కుమార్ కథ, కథనాలు బాగున్నాయి.

విశ్లేషణ :

నాని గ్యాంగ్ లీడర్ ఇదో రివెంజ్ స్టోరీ. కాని హీరో విలన్ కోసం వెతికే రివెంజ్ స్టోరీ కాదు. రివెంజ్ రైటర్ అయిన హీరోకి ఓ ఐదుగురు ఆడవాళ్లు పరిచయం అవడం వారి రివెంజ్ ను హీరో తీర్చడమే సినిమా కథ. సినిమా కథ చాలా సింపుల్ గా ఉన్నా కథనం బాగుంది. సినిమాతో మరోసారి విక్రం కె కుమార్ తన డైరక్షన్ టాలెంట్ చూపించారు. కొన్ని సన్నివేశాలు అతని డైరక్షన్ ప్రతిభ తెలిసేలా చేస్తాయి.

ఇక పాత్రల దగ్గర నుండి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో కూడా విక్రం సఫలమయ్యాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఎంచుకున్న కథను చెప్పిన తీరు కూడా బాగుంది. కామెడీ, రివెంజ్, యాక్షన్ ఎంటర్టైనర్ ఆ గ్యాంగ్ లీడర్ ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.

హీరోగా నాని అదరగొట్టగా విలన్ గా కార్తికేయ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాడు. ఓవరాల్ గా నాని గ్యాంగ్ లీడర్ సినిమా బిందాస్ గా ఒకసారి చూసేయొచ్చు. సినిమాకు పెట్టిన పైసలకు శాటిస్ఫై అయ్యేలా కథ, కథనాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సైటింగ్ గా నడిపించిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేశాడు. ఓవరాల్ గా సినిమా నాని ఖాతాలో మరో హిట్ తెచ్చినట్టే.

ప్లస్ పాయింట్స్ :

నాని

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

కాస్టింగ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

ఊహించే కథ

బాటం లైన్ :

నాని గ్యాంగ్ లీడర్.. రివెంజ్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news