రెస్ట్ తీసుకుంటున్న తారక్ … ఫైటింగ్ చేస్తున్న చెర్రీ

RRR latest update

స్టార్ డమ్ ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు… అంతకంటే ఎక్కువ రేంజ్ ఉన్న దర్శకుడు … వీరందరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ‘దర్శక బాహుబలి’ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమ మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా… షూటింగ్ జరుపుకుంటోంది.

మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఉన్న సీన్స్ ను షూట్ చేస్తే.. సెకండ్ షెడ్యూల్ లో ఒక్కో హీరోకు సంబంధించిన సీన్స్ ను తీస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్ కు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్స్ ను ఇప్పుడు తీసేపనిలో బిజీగా ఉన్నారు.

పోలీస్ చెక్ పోస్ట్ కు సంబంధిన సెట్ ను వేసి ఆ సెట్ లో యాక్షన్స్ సీక్వెన్స్ తీస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం చెర్రీ ఫైటింగ్ చేసే పనిలో బిజీ బిజీ గా ఉన్నాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ చెక్ పోస్ట్ సెట్ లో రామ్ చరణ్ మరియు పది మంది ఫైటర్స్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాడు రాజమౌళి.ఈ షెడ్యూల్ అయిపోగానే ఈ యంగ్ హీరోల పక్కన నటించబోయే లక్కీ గర్ల్స్ ను ఫైనల్ చేస్తారట.

Leave a comment