Gossipsజబర్దస్త్ కు రోజా గుడ్ బై.. నాగబాబు పరిస్థితి ఏంటో..?

జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. నాగబాబు పరిస్థితి ఏంటో..?

స్మాల్ స్క్రీన్ పై నవ్వుల హంగామా చేసే జబర్దస్త్ షో అందరికి తెలిసిందే. ఐదేళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను నవ్విస్తున్న ఈ షోకి జడ్జులుగా నాగబాబు, రోజా ఉంటున్నారు. 2019 ఏపి ఎలక్షన్స్ టైంలో జనసేన ఎంపిగా నాగబాబు, వైసిపి ఎమ్మెల్యేగా రోజా పోటీ చేశారు. తాను గెలిచినా ఓడినా జబర్దస్త్ మాత్రం చేస్తానని నాగబాబు చెబుతూ వస్తుండగా.. రోజా మాత్రం ఆల్రెడీ ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి తాను జబర్దస్త్ చేస్తూ వచ్చాను.. కాని ఈసారి గెలిస్తే మాత్రం షోకి గుడ్ బై చెప్పేస్తా అన్నది.

ఎన్నికల తర్వాత ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న గ్యాప్ లో రోజా మళ్లీ జబర్దర్స్త్ లో అడుగుపెట్టింది. కాని నాగబాబు మాత్రం రాలేదు. ఫైనల్ గా రోజా ఎమ్మెల్యేగా గెలిచింది. సో జబర్దస్త్ కు ఆమె శాస్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఇక నగబాబు పరిస్థితి దారుణంగా మారింది. తమ్ముడు పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు కాబట్టి ఈ అవమాన భారంతో జబర్దస్త్ కు నాగబాబు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఒకవేళ నాగబాబు వచ్చినా నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. ఇప్పటికే శ్రీ రెడ్డి లాంటి యాంటీ మెగా ఫ్యాన్స్ కు నాగబాబు జబర్దస్త్ కే పరిమితమని.. స్నేక్ రాజా అన్నపూర్ణ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది. మరి ఈ టైంలో నాగబాబు జబర్దస్త్ కు వస్తాడా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news