అకిరా పవర్ స్టార్ కి దూరం అవుతాడా..?

renudessai-comments-on-akiranandh

పవన్ తో కలిసి ఉన్నా లేకున్నా అకిరా నందన్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అంటున్నారు. పవన్, రేణుదేశాయ్ విడిపోయి చాలా రోజులవుతుంది. పిల్లలని తన దగ్గరే ఉంచుకుంది రేణుదేశాయ్. ఈమధ్య మరో పెళ్లికి సిద్ధమైన రేణుదేశాయ్ అకిరా నందన్ ను జూనియర్ పవర్ స్టార్ అనడంపై తన అసంతృప్తిని వ్యకపరచింది.

లేటెస్ట్ గా అకిరా నందన్ ఏకాగ్రతతో ల్యాప్ ట్యాప్ చూస్తున్న పిక్ షేర్ చేసింది రేణుదేశాయ్. దీనికి జూనియర్ పవర్ స్టార్ అంటూ రెస్పాన్స్ రావడం చూసి అకిరాని జూనియర్ పవర్ స్టార్ అనొద్దని.. అలా అన్న ఎకౌంట్ ను డిలీట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. పవన్ తో ఏ గొడవతో రేణుదేశాయ్ విడిపోయిందో తెలియదు కాని అప్పుడప్పుడు పిల్లలని కలిసేందుకు పవన్ రావడం జరిగేది.

వేరుగా ఉంటున్నా పవన్ వారసుడిగా అకిరానే జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కాని రేణుదేశాయ్ మాత్రం ఆ కామెంట్స్ కు నెగటివ్ గా రెస్పాండ్ అవుతుంది. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment