తారక్ పై రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు !

renu desai

ఈ మధ్య ఎదో ఒక సందర్భంలో హాట్ టాఫిక్ తో  మీడియాలో కనిపిస్తోంది  పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్. రేణుదేశాయ్ తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు తెలుగు సినీజనాల్లో పెద్ద సంచలనంగా మారాయి.

ఈ జనరేషన్ హీరోల్లో డైలాగ్ చెప్పాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, ఎలాంటి పాత్రను అయినా సులువుగా  చేయాలన్నా ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఈ నటరుద్రుడికి నాటి తరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు ఎవరైనా ఎన్టీఆర్ నటనకు మంత్ర ముగ్ధులు అయిపోవాల్సిందే.అదీ యుంగ్ టైగర్ పవర్ అంటే.  తాజాగా ఎన్టీఆర్‌పై పవన్‌కళ్యాణ్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ ప్రశంసలు కురిపించారు.

తెలుగులో ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తోన్న రేణు దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కంటెస్టెంట్ తారక్ డ్యాన్స్‌కు పెర్పామ్ చేశాడు. ఈ కంటెస్టెంట్ చేసిన పెర్పామెన్స్ మీద తన ఒపీనియన్ చెప్పేముందు రేణు తారక్ గురించి మాట్లాడింది.

తెలుగులో లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో ఈ జనరేషన్‌లో ఒక్క తారక్ మాత్రమే పౌరాణిక డైలాగులు పర్‌ఫెక్ట్‌గా చెప్తాడని రేణు తారక్‌ను ఆకాశానికి ఎత్తేసింది. అంతే కాదు తారక్ గొప్ప డ్యాన్సర్‌, చాలా సింపుల్‌గా స్టెప్పులు వేస్తాడని పొగడ్తలతో తారక్ ని ఆకాశానికి ఎత్తిసింది రేణు. పవన్ మాజీ భార్య తారక్ ని ఈ విధంగా పొగిడెయ్యడంతో తారక్ అభిమానులు ఆనందంలో ములిగితేలుతున్నారు.

Leave a comment