బాహుబలి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందా?

Rana Daggubati

బాహుబలి సినిమా తర్వాత నాజర్ – సత్యరాజ్ వంటి సీనియ‌ర్ న‌టుల‌తో మరోసారి కలిసి నటించబోతున్నాడు రానా.  తమిళంలో మదై తిరందు అనే పీరియాడికల్ మూవీలో ఈ కాంబో రిపీట్ కానుంది. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. మరికొన్ని రోజులు చిత్ర యూనిట్ అక్కడే ఉంటుంది. ఇక ఈ సినిమాలో రానా కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

ఇందులో హీరోయిన్ గా రెజీనా కెసాండ్రా నటిస్తోంది. ఈ మూవీని తెలుగులో 1945 పేరుతో డబ్బింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు.

ఐఎన్ఏలో పోరాడిన ఓ సైనికుడి జీవితగాథతో 1945 సినిమా తెరకెక్కు తోంది. బాహుబ‌లి, నేనే రాజు నేనే మంత్రి ఇలా వ‌రుస విజ‌యాల‌తో రానా కెరియ‌ర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. వాటికి కొనసాగింపుగానే ఈ పిరియాడిక‌ల్ మూవీ ఉంటుంద‌న్నది కోలీవుడ్ టాక్.

Leave a comment