మళ్లీ కొడతానంటున్న ఇస్మార్ట్ హీరో

112

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సరికొత్త అల్ట్రాస్టైలిష్ లుక్‌లో రామ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత రామ్ చేయబోయే సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ న్యూస్ బయటకొచ్చింది.

రామ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘నేను శైలజ’ చిత్ర డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మరోసారి జత కట్టనున్నాడు ఈ కుర్ర హీరో. రామ్ కోసం ఓ అదిరిపోయే స్టోరీని రెడీ చేశాడట కిషోర్. అదే కథను రామ్‌కు వినిపించగా మనోడు వెంటనే ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాను రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు టాక్. ‘నేను శైలజ’ ఇచ్చిన సక్సెస్‌తో మరోసారి అదే డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రామ్ రెడీ అవుతున్నాడు.

కాగా కిషోర్ తిరుమల ఇటీవల చిత్రలహరి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి ‘నేను శైలజ’ జోడీ ఈ సారి ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తారో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment