సంచలనంగ మరీనా రామ్ గోపాల్ వర్మ ” లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ” ట్రైలర్..!

29

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా అసలు కథ తాను చెబుతానంటూ చేస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన విషయాలను ఈ సినిమాలో చెప్పనున్నాడు వర్మ. అయితే వర్మ వర్షన్ మాత్రం ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథ ఇదే అంటూ చెబుతున్నాడు. ఎన్.టి.ఆర్ జీవిత చరమాకంలో ఆయన పడిన ఇబ్బందులను సినిమాలో చూపిస్తున్నాడు వర్మ.

ఇక అందరికి తెలిసిన ఎన్.టి.ఆర్ రాజకీయ పక్షాళన ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ సినిమాలో ప్రస్థావించాడు. ముఖ్యంగా వాడిని నమ్మడమే నేను చేసిన తప్పని చెప్పడం అది ఎవరిని ఉద్దేశించి చెప్పాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమాలో వర్మ ఏం చెప్పదలచుకున్నాడో క్లారిటీ ఉంది. 3 నిమిషాల ట్రైలర్ లో సినిమాలో ఏయే అంశాలు ప్రషావిస్తున్నారో చెప్పేశాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment