రజినికాంత్ పై కుమార్తె ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు..!

rajinikanth-daughter-news

సూపర్ స్టార్ రజినికాంత్ ఈ ఏజ్ లో కూడా వరుస వెంట సినిమాలు చేస్తున్నాడు. యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రజిని సినిమాల వేగం ఉంది. ఫ్యాన్స్ ను ఉత్సాహపరచే సినిమాలతో రజిని వయసు పెరుగుతున్నా కొద్ది మరింత ఎనర్జీతో పనిచేస్తున్నారు. అయితే దీనిపై రజిని కుమార్తె ఐశ్వర్య కామెంట్ చేసింది. త్వరగా తన తండ్రి రిటైర్ అవడం మంచిదని సూచించింది.

కాలా రిలీజ్ అయ్యిందో లేదో కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు రజినికాంత్. ఈ సినిమా గురించి ప్రస్థావిస్తూ రజిని సినిమాలను మెల్లగా తగ్గించేసి ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకున్నారు ఐశ్వర్య. జీవితంలో ఎదురయ్యే బాధలని.. ఆనందాలని సమానంగా తీసుకోవాలని తన తండ్రి చెబుతారని ఆయన చెప్పే ఆ మాటలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు ఐశ్వర్య.

రోబో సీక్వల్ గా 2.ఓ రిలీజ్ కు రెడీ అవుతుండగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు రజినికాంత్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Leave a comment