Moviesపూరి అంటేనే సంచలనం.. పైసా వసూల్ తో సరికొత్త రికార్డ్..!

పూరి అంటేనే సంచలనం.. పైసా వసూల్ తో సరికొత్త రికార్డ్..!

ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి రికార్డులను సాధించడంలో కూడా తనకు తానే సాటని నిరూపించుకున్నాడు. బాలీవుడ్ డైరక్టర్ కు ఏమాత్రం తీసిపోని పూరి వారి లానే సినిమా ముహుర్తం నాడే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాడు. ఈ విషయంలో పూరి మాటంటే మాటే. ప్రస్తుతం పూరి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్.

ముహుర్తం నాడే గురి తప్పకుండా సెప్టెంబర్ 29న రిలీజ్ పక్కా అని తేల్చి చెప్పేశాడు పూరి. ఇక అదే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడమే కాకుండా సినిమాను అనుకున్న డేట్ కన్నా ముందే పూర్తి చేశాడు. బాలయ్యా పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అనుకున్న డేట్ కే సినిమా పూర్తి చేయని దర్శకులున్న ఈరోజుల్లో అనుకున్న డేట్ కన్నా నెల ముందు సినిమా రిలీజ్ చేసే సత్తా అది కేవలం పూరి ఒక్కడికే ఉందని చెప్పొచ్చు.

ఇక చేసేది యువ హీరోలో లేక కుర్ర హీరోలో అనుకుంటే పొరపాటే.. స్టార్స్ తో చేసినా పూరి లెక్క తప్పదు. అందుకే పూరిని టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ అంటుంటారు. అయితే ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి ఇలా చుట్టేయడమే దానికి కారణాలవుతుండగా తను బ్లాక్ బాస్టర్ కొట్టినా సినిమాకు ఇదే ఫార్ములా అప్లై చేశాడని అంటున్నారు. మరి పూరి డైరక్షన్ లో వస్తున్నా బాలయ్య పైసా వసూల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news