Gossipsసాహో తర్వాత కూడా ప్రభాస్ ప్రయోగమే..!

సాహో తర్వాత కూడా ప్రభాస్ ప్రయోగమే..!

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో మూవీ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

బాహుబలి తర్వాత సుజిత్ లాంటి ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో సినిమా చేయడమే రిస్క్ అనుకుంటుండగా సాహో తర్వాత సినిమా కూడా మళ్లీ ఒక సినిమా ఉన్న దర్శకుడికే అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్. అతనెవరో కాదు జిల్ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన రాధాకృష్ణతో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడట. ప్రభాస్ ఛాన్స్ ఇస్తే క్రేజీ కాంబినేషన్ సెట్ చేసే పనిలో దర్శక నిర్మాతలుండగా తను మాత్రం కొత్త వారితో సినిమాలు చేస్తూ షాక్ ఇస్తున్నాడు.

ఎంత పెద్ద దర్శకులైనా సరే కథలో బలం లేకపోతే సినిమాలు ఆడవు. కాబట్టి కరెక్ట్ కంటెంట్ ఉంది కాబట్టే ప్రభాస్ కూడా వారితో సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. సాహో హిట్ కొడితే తనకన్నా సుజిత్ కు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news