పవన్ అతనికే ఓటేశాడు.. తర్వాత సినిమా ఫిక్స్..!

pavan next movie details
అజ్ఞాతవాసితో అదిరిపోయే హిట్ కొట్టి తన దమ్ము చూపిస్తాడనుకున్న పవన్ అది కాస్త తుస్సుమనేసరికి ఈసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఫిబ్రవరి నుండి పవన్ తర్వాత సినిమా మొదలు పెడతారట. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. అసలైతే ఏ.ఎం.రత్నం నిర్మాణంలో నీసన్ డైరక్షన్ లో పవన్ సినిమా చేయాల్సి ఉన్నా అది మళ్లీ వెనక్కి వెళ్లింది.
ఇప్పుడు వెంటనే ఓ యాక్షన్ సినిమా చేస్తేనే కాని ఫ్యాన్స్ ఖుషిగా ఉండరని భావించిన పవన్ అలాంటి కథతోనే సినిమా చేస్తున్నాడట. హైపర్ తర్వాత సంతోష్ శ్రీనివాస్ చేస్తున్న ఈ సినిమా పవన్ హీరో అనగానే క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఈ సినిమా కోసం 40 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది.
మొత్తానికి పవర్ స్టార్ సంతోష్ శ్రీనివాస్ తో తర్వాత సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి వరుస ఫ్లాపులను చవిచూస్తున్న పవన్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a comment