Gossipsరేణు పై పవన్ కొత్త ప్రేమాయణం..!

రేణు పై పవన్ కొత్త ప్రేమాయణం..!

నటి రేణూ దేశాయ్‌ గత కొంత కాలంగా తన ట్వీట్స్ మరియు ఇంస్టాగ్రామ్ ఫోటలతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనే సమాచారం చూచాయగా ఇచ్చారు. దీని పై నెటిజన్స్ మరియు పవన్ అభిమానులు పలు విధలుగా స్పందించారు. అయితే నిన్న రాత్రి రేణు దేశాయ్ అఫిషియల్ గ తనకి ఎంగేజ్మెంట్ అయ్యిందని వరుడు తో ఉన్న ఫోటలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఫోటోలలో కూడా ఎక్కడ వరుడిని కనపడనీయలేదు. కాగా..రేణూ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా..సినీ నటుడు, జన సేన ఆధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియచేసారు.
‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. రేణు దేశాయ్, పవర్ స్టార్ కి జోడిగా తెలుగులో ‘బద్రి’, ‘జానీ’ సినిమాలలో నటించారు, అనంతరం వీరిద్దరూ 2009 లో చట్టబద్ధంగా వివాహం చేసుకోగా, వీరికి అకిరా అనే ఒక కొడుకు,అధ్య అనే ఒక కూతురు ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన 2012లో రేణూ, పవన్‌ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకి పవన్‌..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news