మెగా హీరోలకు చుక్కలు చూపిస్తున్న గోపిచంద్..!

pantham-release-date-details

మాస్ హీరో గోపిచంద్ ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఈమధ్య వరుస ఫ్లాపులను ఫేజ్ చేస్తున్న గోపిచంద్ ఈసారి పంతం అంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో మెగా హీరోలకు షాక్ ఇస్తున్నాడు గోపిచంద్. అదెలాగా అంటే జూలై 6న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆరోజే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐలవ్యూ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

మరోపక్క మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగ చేస్తున్న విజేత సినిమా కూడా ఆరోజే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ ఇద్దరి మెగా హీరోలకు పోటీగా గోపిచంద్ వస్తున్నాడు. ఈసారి హిట్ పక్కా అన్న కాన్ఫిడెన్స్ తో వస్తున్న గోపిచంద్ పోటీగా ఎవరొచ్చినా వాళ్ళకే రిస్క్ అంటున్నాడు. అయితే మెగా హీరోలిద్దరిలో సాయి ధరం తేజ్ వెనక్కి తగ్గేలా ఉన్నాడు. సో గోపిచంద్ తో పోటీ పడేది కళ్యాణ్ దేవ్ ఒక్కడే.

రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న విజేత సినిమా సాయి కొర్రపాటి నిర్మించారు. ఫాదర్, సన్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మరి మెగా హీరోల జాబితాలో నిలబడాలని చూస్తున్న కళ్యాణ్ దేవ్ బాక్సాఫీస్ దగ్గర విజేత అవుతాడా లేడా అన్నది చూడాలి.

Leave a comment