పందెం కోడి-2 ఆఫీషియల్ టీజర్

విశాల్ హీరోగా 2005లో వచ్చిన పందెం కోటి సూపర్ హిట్ అయ్యింది. తమిళ సినిమానే అయినా తెలుగులో విశాల్ కు మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది పందెం కోడి. లింగుసామి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాకు సీక్వల్ గా పందెం కోడి 2 వస్తుంది. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించారు. ఈసారి ఈ పందెం కోడి మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని టీజర్ తోనే చెప్పాడు విశాల్. విశాల్, కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ కూడా సినిమాకు క్రేజ్ తెచ్చేలా చేస్తుంది. సినిమాలో వరలక్ష్మి కూడా నటిస్తుంది. టీజర్ అంచనాలను ఏర్పరచగా అక్టోబర్ 18న వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment