Movies'ఆఫీసర్' కలెక్షన్స్ కుప్పకూలిన నాగార్జున

‘ఆఫీసర్’ కలెక్షన్స్ కుప్పకూలిన నాగార్జున

నాగార్జున వర్మల కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ సినిమా మొదటిరోజు కలక్షన్స్ నాగార్జున కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా చాలా లీస్ట్ గా వచ్చాయి. ఎంతగా అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కలుపి కనీసం 50 లక్షలు కూడా దాటకపోవడం విశేషం. ఆర్జివి, నాగార్జునల శివ క్రేజ్ తో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంచనా వేశారు.

కాని మొదటి షో తర్వాత సినిమా చూసేందుకు ఎవరు సాహసం చేయట్లేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో 50 లక్షల ఫిగర్ దాటక పోవడం నాగార్జున కెరియర్ లో ఆఫీసర్ ఓ పెద్ద మచ్చగా మిగులుతుందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్లు అలానే ఉన్నాయని తెలుస్తుంది.

ఏరియాల వారిగా ఆఫీసర్ కలక్షన్స్ చూస్తే..

నైజాం : 9 లక్షలు

సీడెడ్ : 7 లక్షలు

ఉత్తరాంధ్ర : 6.5 లక్షలు

గుంటూర్ : 4 లక్షలు

కృష్ణ : 8 లక్షలు

ఈస్ట్ : 4 లక్షలు

వెస్ట్ : 4 లక్షలు

నెల్లూరు : 2.5 లక్షలు

ఏపి/ టిఎస్ కలక్షన్స్ : 0.45 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news