ఎన్టీఆర్ , చరణ్ ల మల్టీస్టారర్..”ఆ” సలహా మేరకే..!

ntr-ram-charan-movie

బాహుబలి తర్వాత మెగా నందమూరి కాంబినేషన్ సినిమాకు ప్లాన్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. డివివి దానయ్య ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అక్టోబర్ నుండి మొదలయ్యే ఈ సినిమా కథ ఇదే అంటూ రెండు మూడు స్టోరీలు చెక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయాలా అన్న ఆలోచనలో ఉండగా ఈ మల్టీస్టారర్ ఆలోచన వచ్చిందట.

ఇక ముందు ఈ మల్టీస్టారర్ కథను రాజమౌళి సన్నిహితుడు ఎన్.టి.ఆర్ కు చెప్పాడట. మరో హీరో పాత్రకు రాం చరణ్ పర్ఫెక్ట్ అని ఎన్.టి.ఆరే సలహా ఇచ్చాడట. చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు మంచి స్నేహితులు స్టార్ల మధ్య మంచి రిలేషన్ ఉండాలని కోరుకునే వారిలో ఈ ఇద్దరు ఉన్నారు. అందుకే ఈమధ్య తరచు కలుస్తున్నారు.

చరణ్ అయితేనే తనకు పోటీగా పర్ఫెక్ట్ అనుకున్న ఎన్.టి.ఆర్ రాజమౌళి స్టోరీ లైన్ చెప్పగానే ఆ కథకు తనతో పాటుగా చరణ్ కావాలని అన్నాడట. రాజమౌళి సినిమా అంటే ఎన్.టి.ఆర్, చరణ్ ఏంటి ఎలాంటి హీరో అయినా రావాల్సిందే. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారట.

Leave a comment