” ఎన్.టి.ఆర్ మహానాయకుడు ” రివ్యూ & రేటింగ్

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ కథానాయకుడు ఆల్రెడీ రిలీజైంది. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ ఎన్.టి.ఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఎక్కడ ఆపారో అక్కడ నుండి ఈ సినిమా మొదలవుతుంది.
1
కథ :

ఎన్.టి.ఆర్ పార్టీ ఎనౌన్స్ చేసిన సీన్ తో మొదలైన ఈ మహానాయకుడు ప్రచార కార్యక్రమాలను చేస్తారు. ప్రచార సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కుని కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్.టి.ఆర్ కు రాజకీయమైన అనుభవం లేకపోవడంతో నాదెండ్ల భాస్కర్ రావు సహాయం తీసుకుంటారు. అయితే ఎన్.టి.ఆర్ ను నమ్మించి తెవెనుక కుట్ర పన్నుతాడు నాదెండ్ల భాస్కర్ రావు. ఇదే టైంలో బసవతారకం అనారోగ్య పాలవడంతో అమెరికాలో ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్.టి.ఆర్ ను అమెరికాకు పంపించి మంత్రులను నమ్మించి సిఎంగా నాదెండ్ల భాస్కర్ రావు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే తిరిగి వచ్చిన ఎన్.టి.ఆర్ ఏం చేశాడు. మళ్లీ అధికారంలోకి ఎలా వచ్చారు..? మహానాయకుడు సినిమా ఎక్కడ ముగుస్తుందో సినిమాలో చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

ఎన్.టి.ఆర్ పాత్రలో మరోసారి బాలకృష్ణ అదరగొట్టారు. ఈ సెకండ్ పార్ట్ లో మహానాయకుడిగా ఎన్.టి.ఆర్ చేసిన మంచి పనులను చూపించారు. కొన్ని సీన్స్ లో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ ను తలపించేలా చేశారు. ఇక సెకండ్ పార్ట్ లో చంద్రబాబు నాయుడిగా నటించిన రానాకు మంచి స్కోప్ దొరికింది. చంద్రబాబుగా రానా అదరగొట్టాడు. విద్యాబాలన్, సచిన్ ఇలా అందరు బాగా చేశారు.
2
సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ బాగుంది. కీరవాణి మ్యూజిక్ ప్లస్ అయ్యింది. క్రిష్ ఈ పార్ట్ ఎంతో చక్కగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీశాడు. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది. ప్రొడక్ష వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

పార్టీ ప్రచారంతో మొదలైన ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం ఎన్నికల్లో విజయ డంఖా మోగిస్తుంది. ఎన్.టి.ఆర్ తో పన్న ఉంటూనే నాదెండ్ల భాస్కార్ రావు చేసిన కుట్రలను బాగా చూపించారు. అదే ఇంటర్వల్ కార్డ్ పడుతుంది. ఇక మళ్లీ చైతన్య రథంతో రంగంలోకి దిగిన ఎన్.టి.ఆర్ మళ్లీ పవర్ లోకి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
3
ఇక చంద్రబాబు ట్రైన్ లో పొలిటిషియన్స్ ను ఢిల్లి చేరవేసే సీన్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో క్రిష్ తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. కథానాయకుడులో మిస్సైన ఎమోషన్ క్యారీ చేస్తూ కథ చక్కగా నడిపించాడు. ఫైనల్ గా మహానాయకుడు సినిమా బసవతారకం మరణించడంతో ముగుస్తుంది.

ఎంచుకున్న కథ వరకు క్రిష్ బాగానే హ్యాండిల్ చేశాడు. కచ్చితంగా కథానాయకుడు కన్నా మహానాయకుడు అన్ని విషయాల్లో బాగా వచ్చింది. రన్ టైం కూడా మహానాయకుడికి కలిసి వచ్చే అంశం.

ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ

క్రిష్ డైరక్షన్

కీరవాణి

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ఏమి లేవు

బాటం లైన్ :

ఎన్.టి.ఆర్ మహానాయకుడు.. అద్భుతం..!

రేటింగ్ : 3.5/5

Leave a comment