ఎన్టీఆర్ మహానాయకుడు తో పోటీ పడుతున్న హర్రర్ బూతు మూవీ!

36

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిర్. ఈ సినిమా రెండు భాగాలుగా రీలీజ్ చేసే నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ఈ నెల 22న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు అనున్న స్థాయిలో అభిమానులను మెప్పించలేక పోవడంతో డివైడ్ టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయానికి మూడు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. బోల్డ్ కంటెంట్ తో ఉన్న ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా భారీ అంచనాలతోనే రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది వామ్మో ఇంత బోల్ట్ కంటెంట్ సినిమా అంటూ ఆశ్చర్యపోయారు.

ఇక బోల్డ్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా..చాలా స్పీడ్ గా ట్రైలర్ 3 మిలియన్ వ్యూప్స్ ని దాటేసి అంచనాలను పెంచేసింది. డబుల్ మీనింగ్ డైలాగులతో హాట్ సీన్స్ గట్టిగా ఉండడంతో ఓ వర్గం వారిని బాగా ఆకర్షిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వస్తోంది అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.

ఒకవేళ మహానాయకుడు సినిమా ఏ మాత్రం మిశ్రమ స్పందన వచ్చినా..ఫెయిల్యూర్ టాక్ వచ్చినా..కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మిఠాయి – 4 లెటర్స్ అనే మరో రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కూడా ఫిబ్రవరి 22న రిలీజ్ కాబోతున్నాయి

Leave a comment