బిగ్ బాస్-2 ఎన్టీఆర్ తర్వాత అందరూ అతనికే ఓటు..!

ntr-bigboss-2

స్టార్ మా ప్రెస్టిజియస్ గా తీసుకున్న తెలుగు బిగ్ బాస్ అనుకున్న దాని కన్నా ఎక్కువే హిట్ అయ్యిందని చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్టింగే. వ్యాఖ్యాతగా తారక్ తన విశ్వరూపం చూపించాడు. కంటెస్టంట్స్ ను ఉత్సాహపరుస్తూ సాగిన బిగ్ బాస్ సీజన్ 1 టి.ఆర్.పి రేటింగ్ లో కూడా దుమ్మురేపింది.

ఇక బిగ్ బాస్ సీజన్-2 జూన్ నుండి స్టార్ట్ అవబోతుందని అంటున్నారు. అసలైతే ముందు ఈ సీజన్ కు కూడా ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని అనుకోగా.. త్రివిక్రం, రాజమౌళి సినిమాలు ఉండటంతో బిగ్ బాస్-2 చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక ఎన్.టి.ఆర్ కాకుంటే బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు చేస్తారు అంటే నాచురల్ స్టార్ నాని అని అంటున్నారు.

నాచురల్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. బిగ్ బాస్-2 ఎన్.టి.ఆర్ కాకుంటే నానినే పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందన్నది త్వరలో తెలుస్తుంది.

Leave a comment