జక్కన్న మల్టీస్టారర్ లో ఎవరు హీరో..?ఎవరు విలన్..?

ntr and charan

కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీని షాక్ తోపాటు షేక్ చేస్తోన్న దర్శక బాహుబలి జక్కన్నఎన్టీఆర్ – చెర్రీ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టార్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికర వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి సంభందించి ఏ చిన్న వార్త తెలిసినా అభిమానులు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

ఈ సినిమా కోసం యమధీర, బ్రదర్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. సుమారు 170 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి మరో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక్కడే హీరోగా నటిస్తున్నాడట. అదేంటి ఈ సినిమాలో ఎన్టీఆర్ మరి అనే కదా మీ సందేహం..? అసలు విష్యం ఏంటంటే.. ఈ సినిమాలో ఆయనది విలన్ పాత్ర అట. హీరోకి ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఈ విలన్ పాత్రలో తారక్ కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. అయితే ఇటువంటి పాత్రలు చెయ్యడంలో జూనియర్ ని మించిన వారు లేరు.

అయితే ఈ సినిమా మీద రోజుకో వార్త బయటకి వస్తుండడంతో ఏది నిజం ఏది అబద్దం అనే సందేహంలో ఉంటున్నారు ఇరువురి హీరోల అభిమానులు. బయట ఎన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా … దీనిపై జక్కన్న మాత్రం స్పందించడంలేదు.

Leave a comment