కళ్యాణ్ రామ్ తల్లి పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

120

హరికృష్ణ మరణం నందమూరి ఫ్యామిలీని ఎంతగా కలచి వేసిందో తెలిసిందే. కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్ తల్లులు వేరైనా ఇద్దరు అన్నదమ్ములుగా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇంతకుముందు ఎన్నడు తన పెద్దమ్మ గురించి మాట్లాడని ఎన్.టి.ఆర్ మొదటిసారి ఆమె గురించి ప్రస్థావించడం జరిగింది.

నాన్న మరణంతో ఫ్యామిలీ మొత్తం విషాదంలో ఉంది. ఇక భర్త మరణంతో పెద్దమ్మ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నాడు. అన్న, తనకు బాధ ఉన్నా మాకన్నా తల్లులిద్దరికి ఆ బాధ ఎక్కువని అన్నాడు ఎన్.టి.ఆర్. తన తండ్రి పరిపూర్ణ జీవితాన్ని గడిపి వెళ్లారని. ఇక తన తల్లి ఇప్పుడు తన పిల్లలతో కాలక్షేపం చేస్తుందని.. వారి నవ్వులే ఆమె ఆనందాన్ని వెతుక్కుంటున్నారని అన్నాడు తారక్.

రీసెంట్ గా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త ఎమోషనల్ అయిన ఎన్.టి.ఆర్ ప్రమోషన్స్ కోసం ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో కాస్త కుదుటపడినట్టు ఉన్నాడు. మనుషులు దూరమైనా వారి జ్ఞాపకాలతో మిగిలిన జీవితాన్ని సాగించాలి కదా.

Leave a comment