విజయ్ కి చుక్కలు చూపిస్తున్న ఆంధ్ర అభిమానులు..

122

వరుస విజయాలతో ఊపు మీదున్నవిజయ్ తన కెరీర్ ఆరంభంలోనే రాజకీయ నేపధ్యం గల ‘నోటా’ సినిమా ఎన్నుకొని పెద్ద సాహసం చేసాడు. అయితే సినిమాతో భారీ హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశ పడ్డారు. కానీ ఆ సినిమా బాక్సఆపీసు వద్ద బోల్తా కొట్టింది. విజయ తన డిఫ్రెంట్ యాటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తెలంగాణ కు చెందిన విజయ్ అక్కడ రాజకీయ నాయకులతో దగ్గరగా ఉంటూ తెలంగాణ హీరోగా ముద్ర వేయించుకున్నాడు.

అయితే ఈ విషయం పై విజయ్ పై సోషల్ మీడియాలో దాడి ఎక్కువ అవ్వడంతో… సక్సెసఫుల్ హీరోగా రాణించాలంటే.. తెలంగాణ- ఆంధ్రా రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉండాలని ఆలస్యంగా గ్రహించిన ఆయన దిద్దుబాటు చర్యలకు దిగాడు.

”నోటా” సినిమా ప్రమోషన్ కోసం మొదటిసారిగా విజయవాడకు వచ్చిన విజయ్ ఆ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో ‘నోటా’ ఘన విజయం సాధిస్తుంది అని చెపుతూ .. అత్యుత్సాహంతో ‘నోటా’ సినిమా ఘన విజయం గురించి ప్రమాణం చేస్తున్నాను అంటూ భారీ డైలాగులు చెప్పి అంచనాలు పెంచాడు. అంతేకాదు తనకంటూ అభిమానులను ఆంధ్రా ప్రాంతంలో కూడ బాగా ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద స్కెచ్ ని ‘నోటా’ ద్వారా అమలు చేయాలని చూసాడు. అయితే ‘నోటా’ భారీ డిజాస్టర్ గా మారడంతో.. విజయ్ మాట తప్పాడు అంటూ కొందరు ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులు విజయ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే విజయ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ పెరిగిపోయిందని అందుకే అంత ధీమాగా ప్రకటన చేసి ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నాడు అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ ప్రభావం తన తరువాత సినిమా టాక్సీవాలా మీద పడుతుందేమో అన్న టెన్షన్ లో విజయ్ ఉన్నాడు. అసలే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ రీ షూట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో కొంచెం తగ్గి ఉండాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే అంటారు సవరం అయితే కానీ వివరం రాదని.

Leave a comment