హ్యాట్రిక్ హిట్స్ దర్శకుడితో నితిన్ సినిమా

nithin

బొమ్మ హిట్ అయ్యింది అంటే అందులో హీరో దమ్ము ఎంత ఉంది అనేదాని కన్నా దర్శకుడి సత్తా గురించి మాట్లాడేస్తున్నారు ఈతరం ప్రేక్షకులు. మారిన ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని బట్టి దర్శకులు కూడా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిట్ కోసం తపిస్తున్న దర్శకులు ఉండగా తీసిన మూడు సినిమాలు హిట్ కొట్టడం ఒక్క దర్శకుడికే సాధ్యమైంది అతనే అనీల్ రావిపుడి.

పటాస్, సుప్రీం సినిమాలతో సత్తా చాటిన అనీల్ కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న రవితేజకు రాజా ది గ్రేట్ తో హిట్ ఇచ్చాడు. హ్యాట్రిక్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి తన తర్వాత సినిమా లవర్ బోయ్ నితిన్ తో చేస్తున్నాడట. ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. లైతో అంచనాలను అందుకోని నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా పూర్తి కాగానే అనీల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడట. ఆడియెన్స్ పల్స్ పట్టేసిన దర్శకుడిగా అనీల్ దర్శకత్వ ప్రతిభ అందరికి తెలిసింది. మరి నితిన్ తో సినిమా కూడా హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతాడేమో చూడాలి.

Leave a comment