Moviesమ‌న్మ‌థుడు -2 కు కాసుల వ‌ర్షం..!

మ‌న్మ‌థుడు -2 కు కాసుల వ‌ర్షం..!

ఆరు ప‌దుల వ‌య‌స్సున్న నాగార్జున… కానీ రూపులో మాత్రం న‌వ యువ‌కుడు. కొడుకుల‌తో పోటీ ప‌డుతు సినిమాలు తీస్తూ, న‌టిస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 పేరుతో ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ అక్కినేని నాగార్జున ఉర‌ప్ నాగ్ ఉర‌ప్ మ‌న్మ‌థుడు ఇప్పుడు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాడు. కుర్ర హీరోయిన్ల‌తో జ‌త‌క‌డుతూ టాలీవుడ్‌లో ఎవ‌ర్‌గ్రీన్ బాయ్ క‌నిపిస్తున్నాడు నాగార్జున‌.

మ‌న్మ‌థుడు 2 సినిమా ను ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించాడు. ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇక సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం కూడా చాలా డిఫ‌రెంట్‌గా సాగిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌లు నెట్టింట్లో హ‌ల్‌ఛ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ట్రైల‌ర్ ఈనెల‌25న విడుదల చేసేందుకు చిత్ర‌యూనిట్ సిద్ద‌మ‌వుతుంద‌ట‌.

అలాగే చిత్రం డిజిటల్ రైట్స్‌ను ఇటీవ‌ల చిత్ర యూనిట్ అమ్మ‌కం జ‌రిపింద‌ట‌. ఇందులో ప్ర‌ముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.7.4కోట్ల‌కు కొనుగోలు చేసింద‌ట‌. ఈ చిత్రంకు సాహో పోటీ వ‌స్తుంద‌నుకుంటే సాహో పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు నాగార్జున మ‌న్మ‌థుడు 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాగార్జున స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, ఇందులో స‌మంత‌, కీర్తి సురేష్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌య‌కామ్ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news