నయన్ ఆ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉందా ..?

nayanathara

లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార ప్రేమ వ్యవరాలు సీరియల్ కథలా అనేక ట్విస్ట్ లమీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే … దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే ఈమె ప్రేమలో కూడా అనేక ఆసక్తికర సంఘటనలకు తావిస్తోంది. మొదట తమిళ యంగ్ హీరో శింబూతో మొదలయిన నయన్ లవ్ స్టోరీ ఆ తరువాత ఎన్నో వివాదాలకు నిలయం అయ్యింది. ఆ తరువాత ఆ ప్రేమ వ్యవహారానికి పులిస్టాప్ పడడంతో … ఆ తర్వాత నయన ప్రేమ నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవతో మొదలైంది.

అప్పటికే వివాహమైన ప్రభుదేవా నయన కోసం భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ఇక పెళ్ళి ఖాయం అనుకుంటున్న సమయంలో సడెన్ గా ప్రభుదేవ, నయనతార మధ్య స్పర్థలు రేగాయి. దాంతో వీరి ప్రేమ ఏడడుగులు వేయకముందే ఆగిపోయింది. దాంతో నయనతార మళ్ళీ కెరీర్‌పై దృష్టి నిలిపింది. తమిళ్‌, తెలుగు చిత్రాలు అంగీకరిస్తూ ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నిస్తోంది. కొద్ది రోజులుగా ఆమె మళ్ళీ ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి నటుడితో కాకుండా దర్శకుడు విఘ్నేష్‌తో నయన్ ప్రేయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వీరి మధ్య సంబంధం గురించి ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు. కానీ వీరు ప్రేమికులని మీడియా ఎప్పుడు ముద్ర వేసింది. తాజాగా విఘ్నేశ్ వివన్ ట్విట్టర్ ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు వీరు లవ్ ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. నయనతార, విఘ్నేశ్ ఇద్దరు కలిసి క్రిస్మస్ జరుపుకున్న ఫొటలను శివన్ షేర్ చేశాడు. అయితే నయన్ ఈ సారైనా తన ప్రేమ పెళ్లి పీటలు ఎక్కేలా చేసుకుంటుందో లేదో చూడాలి.

Leave a comment