Gossipsనాగశౌర్య @ నర్తనశాల ప్రీమియర్ షో టాక్..!

నాగశౌర్య @ నర్తనశాల ప్రీమియర్ షో టాక్..!

సీనియర్ ఎన్.టి.ఆర్ చేసిన నర్తనశాల టైటిల్ తో సినిమా తీయాలంటే పెద్ద సాహసమే చేయాలి కాని నాగ శౌర్య @ నర్తనశాల అంటూ ఓ డిఫరెంట్ కథతో వచ్చాడు. శ్రీనివాస్ చక్రవర్తి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య సొంతంగా నిర్మించాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ చూస్తే డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తున్నా హీరో క్యారక్టరైజేషన్ ఏమాత్రం బాగాలేదని అంటున్నారు. అంతేకాదు కథ, కథనాలు మొత్తం కామెడీ ఉన్నా ఆడియెన్స్ ను విసుగు తెప్పించేలా ఉన్నాయని టాక్ వస్తుంది. యామిని భాస్కర్, కాష్మిరా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో వారి పాత్రలు అంతగా ఇంప్రెస్ చేయలేదని తెలుస్తుంది.

ఛలో హిట్ తో జోష్ లో ఉన్న నాగ శౌర్య డిఫరెంట్ అటెంప్ట్ తో వచ్చిన ఈ నర్తనశాల సినిమా నిరాశ పరచిందని చెప్పొచ్చు. సినిమా ఆడియెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసేలా సాగుతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news