” నన్ను దోచుకుందువటే ” మూవీ టీజర్

nannu-dhochukundhavate-teas

ప్రముఖ కథానాయకుడు సుధీర్ బాబు, నాభ నటేశ జంటగా నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. చిత్ర బృందం వారు కొన్ని నిమిషాల ముందు ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఇది ఒక కామెడీ ప్రేమ కథ చిత్రం అని టీజర్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాలో సుధీర్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సుధీర్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. సుధీర్ బాబు కి నిర్మాత గా ఇదే తొలి చిత్రం కావటం విశేషం. ఇక హీరోయిన్ నాభ నటేశ కూడా తొలి సారి సుధీర్ కి జోడిగా నటిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సరదా ప్రేమ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అని చిత్ర వర్గాల సమాచారం. ప్రముఖ దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అజనేషు బీ లోకనాథ్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు. సుధీర్ బాబు అమ్మ గారు శ్రీ రాణి పోసాని ఈ చిత్రానికి సహా నిర్మాత గా వ్యవహరించారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విడుదల తేదిని అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉంది.

Leave a comment