Gossipsసమంత ఫోటోలపై చైతన్య అభ్యంతరం.. అయినా తగ్గేది లేదంటుంది..!

సమంత ఫోటోలపై చైతన్య అభ్యంతరం.. అయినా తగ్గేది లేదంటుంది..!

హీరోయిన్ గా ఉన్న సమంత కాస్త అక్కినేని కోడలిగా మారిన విషయం తెలిసిందే. చైతుతో మొదటి సినిమా నుండి ప్రేమలో ఉన్న సమంత అక్కినేని కోడలుగా మారి అదరగొడుతుంది. పెళ్లి తర్వాత కూడా సమంత తన ఫాం కొనసాగిస్తుంది. అయితే సినిమాల కన్నా ఫోటో షూట్స్ లో కూడా తెగ రెచ్చిపోతుంది సమంత. ఈమధ్య సమంత ఫోటో షూట్స్ రచ్చ మాములుగా లేదు. అయితే సమంత చేస్తున్న ఈ హంగామా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

అయితే సమంత ఈ ఫోటో షూట్స్ నాగ చైతన్యకు నచ్చట్లేదట. చైతుకి తాను సర్ధిచెప్పుకుని అలా కానిచ్చేస్తుందట. ఎవరికి నచ్చినా నచ్చకున్నా తాను చేయాలనుకున్నది చేస్తా అని అంటుంది సమంత. ప్రతుతం తమిళంలో సూపర్ డీలక్స్ సినిమా చేస్తున్న సమంత ఆ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూస్ పాల్గొంటుంది. అందులో భాగంగా తన ఫోటో షూట్స్ పై వచ్చే ట్రోల్స్ పై కూడా స్పందించింది సమంత.

అసలు ఆ ట్రోల్స్ లాంటివి తాను అసలు పట్టించుకోనని తన మనసుకి నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్తా అని అంటుంది. పెళ్లి తర్వాత అమ్మడి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. వరుస సినిమాలతో సమంత ఏ హీరోయిన్ సంపాదించలేని క్రేజ్ పెళ్లి తర్వాత కొనసాగిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news