కళ్యాణ్ రామ్ నా నువ్వే ట్రైలర్.. లవర్ బోయ్ గా నందమూరి హీరో ఇరగదీశాడు..!

naa-nuvve

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా నా నువ్వే. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే క్రేజ్ తెచ్చుకోగా ఇక ఈ ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది.

కళ్యాణ్ రామ్ ఇదవరకు సినిమాల ఇమేజ్ ఏమాత్రం కనిపించకుండా కొత్త హీరోని చూస్తున్నట్టుగా ఉంది. తమన్నా కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. శరత్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ గా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. తన ఫేట్ మార్చేసిన హీరో గురించి ఎదురుచూసే కథనాయిక కథ నా నువ్వే. ముద్దవరపు కిరణ్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నా నువ్వే ఈ నెల 14న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమాతో ఈసారి తప్పకుండా కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరిస్తాడని గట్టిగానే చెప్పొచ్చు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో 3 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది.

Leave a comment