ఎన్టీఆర్ నాకు అన్న కాదు.. మోక్షజ్ఞ ఫీజులు ఎగిరిపోయే ఆన్సర్..!

mokshagna comments on ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. నందమూరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్.టి.ఆర్ తన టాలెంట్ తో సొంత అభిమానులను ఏర్పరచుకున్నాడు. ఇక కొన్నాళ్లు బాబాయ్ బాలయ్యతో సన్నిహితంగా ఉన్నా కొద్దికాలంగా అబ్బాయ్, బాబాయ్ మధ్య దూరం పెరిగింది. బాబాయ్ ప్రస్థావన వస్తే తారక్ స్పందించడం చూస్తూనే ఉన్నాం కాని బాలయ్య మాత్రం అసలు ఎన్.టి.ఆర్ ఊసే ఎత్తడం లేదు.

బాలకృష్ణ సరే.. ఆయన వారసుడు కాబోయే హీరో మోక్షజ్ఞ ఎన్.టి.ఆర్ గురించి ఏమనుకుంటున్నాడు. ఇదే విషయంపై మోక్షజ్ఞను అడుగగా ఎన్.టి.ఆర్ నాకు అన్నయ్య కాదని షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడట. అదేంటి అంటే ఎన్.టి.ఆర్ నాకు అన్నయ్య మాత్రమే కాదు గురువు కూడా అని అన్నాడట. తన తండ్రి దేవుడు అయితే తన అన్న గురువని అన్నాడట మోక్షజ్ఞ. అన్నయ్య నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఎన్.టి.ఆర్ మీద ఉన్న అభిమానం బయట పెట్టాడు మోక్షజ్ఞ.

ఇక త్వరలో మోక్షజ్ఞ హీరోగా సినిమా మొదలవనుంది. క్రిష్ డైరక్షన్ లో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో ఓ క్రేజీ లవ్ స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అవుతుందని తెలుస్తుంది.

Leave a comment