Gossipsమెగాస్టార్ తో కొరటాల శివ.. కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..!

మెగాస్టార్ తో కొరటాల శివ.. కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..!

ఖైది నంబర్ 150 తర్వాత ఉయ్యాలవాడం నరసింహారెడ్డి బయోపిక్ లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది. సైరా షూటింగ్ పూర్తి చేశాక కొద్దిపాటి గ్యాప్ తోనే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. సోషల్ మెసేజ్ కథలనే కమర్షియల్ పంథాలో ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తున్న కొరటాల శివ చిరు కోసం కూడా ఓ అద్భుతమైన కథ రాసుకున్నారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ధనిక, పేద వర్గాల గురించి ఉంటుందట. తరతరాలుగా తిని కూర్చున్నా తరగని ఆస్తులు సంపాదించే కుబేరులు ఒక వైపు.. ఒక్క పూట గడిస్తే చాలు అనుకునే జీవితాలు మరోవైపు వీటిని కంపేర్ చేస్తూ ప్రభుత్వాలు పేద వారి మీద చూపించే వివక్షను వేలెత్తిచూపేలా ఈ సినిమా కథ ఉంటుందట.

అంతేకాదు సినిమాలో చిరు పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుందట. బిలీనియర్ గా ఒక పాత్ర.. రైతుగా మరో పాత్ర ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవి ఇందులో డ్యుయల్ రోల్ చేస్తారని తెలుస్తుంది. కథ బాగా నచ్చడంతో చిరు ఈ సినిమాకు ఓకే చెప్పారట. మరి ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news