Newsషాపింగ్ మాల్ మోసాలపై అకున్ సబర్వాల్ కొరడా.. ఎం.ఆర్.పి రేటు కన్నాఒక్క...

షాపింగ్ మాల్ మోసాలపై అకున్ సబర్వాల్ కొరడా.. ఎం.ఆర్.పి రేటు కన్నాఒక్క పైసా ఎక్కువైనా ఈ నెంబర్ కి ఫోన్ చేయండి !

ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే.. సినిమాకు అయ్యే ఖర్చు కన్నా అక్కడ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లో అయ్యే తినుబండారాల ఖర్చు ఎక్కువయ్యింది. ఎం.ఆర్.పి ఉన్నా ఎవరి వారు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తున్నారు. ఏరియా వైజ్ గా ఎం.ఆర్.పి మీద ఎక్కువ వసూలు చేస్తున్నారు. అయితే దీనిపై సీరియస్ అయిన తూనికలు కొలతల శాఖ సడెన్ గా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల మీద దాడి చేసింది.

ఎం.ఆర్.పి కంటే ఒక్క రూపాయి ఎక్కువగా అమ్మినా కఠిన చర్యలు తప్పవని తూనికలు కొలతల శాఖా కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. 15 బృందాలు ఒకేసారి సిటీలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో దాడి చేయగా దాదాపు 100 కేసుల దాకా నమోదు చేయడం జరిగిందట. మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ లో మోసాలు జరిగినట్టు తెలిస్తే వెంటనే 7330774444 నెంబర్ కు ఫోన్ చేయాలని సబర్వాల్ కోరారు. ఎం.ఆర్.పి రేటు కన్నా ఎక్కువ అమ్మి మధ్యతరగతి వ్యక్తుల జేబులకు చిల్లులు పెడుతూ దోపిడీ చేస్తున్న వారిపై కొరడా ఝులిపించారు సబర్వాల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news