Gossipsమహేష్ డైరక్టర్స్ లిస్ట్ లో అతను కూడా చేరాడు..!

మహేష్ డైరక్టర్స్ లిస్ట్ లో అతను కూడా చేరాడు..!

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే డైరక్టర్స్ కు స్టార్ క్రేజ్ వచ్చేసినట్టే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత అసలైతే సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది కాని ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా టైం పట్టేట్టు ఉందని ఈలోగా అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు మహేష్.

ఈ సినిమా ఓ క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుందట. మహేష్ కెరియర్ లో ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదని చెప్పాలి. సుకుమార్ సినిమా తర్వాత యువ దర్శకుడు అనీల్ రావిపుడి మహేష్ తో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడట. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుసగా సినిమాలను సక్సెస్ అందుకుంటున్న అనీల్ రావిపుడి ఎఫ్-2 సక్సెస్ వేడుకలో కూడా మహేష్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ఓ రకంగా మహేష్ ను కాకాపట్టడమే అని చెప్పొచ్చు.

ఇప్పటికే సుకుమార్, సందీప్ వంగ వెయిటింగ్ లో ఉండగా ఇప్పుడు అనీల్ రావిపుడి కూడా మహేష్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరాడు. ఎఫ్-2 తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని చెప్పిన అనీల్ రావిపుడి ఎఫ్-2 సక్సెస్ మీట్ లో ఇదే టీం తో ఎఫ్-3 కూడా చేస్తున్నామని చెప్పాడు. మరి అది వెంటనే చేస్తారా లేక ఓ సినిమా గ్యాప్ ఇచ్చి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మహేష్ తో అనీల్ సినిమా చేస్తే పక్కాగా అది కూడా క్రేజీ మూవీగా మారే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news