మహర్షిగా మారిన మహేష్.. టైటిల్ అదిరింది అంతే!

31

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ 25వ చిత్రానిక సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమా టైటిల్‌ విషయంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రమోషన్ చేయడంతో ఈ టైటిల్ ఏమిటా అని యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. రిషి అనే పాత్రలో మహేష్ నటిస్తుండటంతో ఈ సినిమా టైటిల్ బహుశా అదే అని ఫిక్స్ అయ్యారు చాలా మంది.

కానీ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు మహర్షి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. సరికొత్త మేకోవర్‌తో మహేష్ అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చాడు. చేతిలో లాప్‌టాప్ పట్టుకుని మహేష్ నడుస్తూ వస్తుండటంతో ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి మహేష్ 25వ చిత్రానికి ఎవ్వరి ఊహలకు అందని టైటిల్‌ను పెట్టి సర్‌ప్రైజ్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా అశ్విని దత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 5 2019లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment