అభిమన్యుడికి మహేష్ ఫిదా..!

mahesh-about-abhimanyudu-movie

విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. పి.ఎస్ మిత్రన్ డైరక్షన్ చేసిన ఈ సినిమా సైబర్ క్రైమ్ నేపథ్యంతో వచ్చింది. తమిళంలో ఆల్రెడీ ఇరుంబు తిరైగా సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మరోసారి విశాల్ సత్తా చాటేలా చేసింది.

ఇక ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. అభిమన్యుడు చాలా ఇంప్రెసివ్ గా ఉంది. దర్శకుడి విజన్ తో ఎంచుకున్న కథను చాలా చక్కగా కన్విన్సెడ్ గా చెప్పాడు. సినిమా కోసం ఎంత రీసెర్చ్ చేశారన్నది తెలుస్తుంది. ప్రేక్షకులకు మంచి సినిమా అందించినందుకు విశాల్ కు, సినిమా టీం అందరికి కంగ్రాట్స్ చెప్పాడు మహేష్.

విశాల్ కెరియర్ లో పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో విశాల్ కు సూపర్ హిట్ ఇచ్చింది ఈ అభిమన్యుడే. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఈ సినిమా గురించి మాట్లాడేలా చేసిందంటే సినిమా ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ అభిమన్యుడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించారు.

Leave a comment