Gossipsమ‌హేష్‌కు ఎస‌రు పెడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌...!

మ‌హేష్‌కు ఎస‌రు పెడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌…!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న హీరోలు ప్రిన్స్ మ‌హేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు ఇదే ఇద్ద‌రికి మ‌ధ్య ఎస‌రు పెడుతుందా… అనేది టాలీవుడ్‌లో వినిపిస్తున్న ప్ర‌శ్న‌. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు టాలీవుడ్ లో టాప్ హీరో. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న యువ హీరో. ఇప్పుడు అదే యువ హీరో సూప‌ర్‌స్టార్‌కు ఎస‌రు పెడుతున్నాడ‌నే టాక్ వినిపిస్తున్న‌ది. మ‌హేష్‌బాబు సినిమాలు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓకే చేస్తున్నాడా… అంటే అవునంటున్నారు సిని ప‌రిశీల‌కులు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌హేష్‌బాబుకు పోటీగా మారాడట‌. మ‌హేష్ బాబు విన్న క‌థ‌లు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వినిపిస్తున్నార‌ట ద‌ర్శ‌కులు. మ‌హేష్‌బాబు వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్నాడు. ఇప్పుడు ఆయ‌న డేట్స్ ఆడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో అనేక మంది ద‌ర్శ‌కులు మ‌హేష్‌బాబు కోసం ఎదురు చూస్తున్నార‌ట‌. అయితే మ‌హేష్‌బాబు కోసం ఎదురు చూసేకంటే మ‌న‌కు అందుబాటులో ఉండే హీరోలతో సినిమా చేసుకుంటే పోదా అనుకుంటున్నార‌ట ద‌ర్శ‌కులు.

అందుకే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌హేష్‌బాబుకు పోటీగా మారాడ‌నే టాక్ వినిపిస్తుంది. దీనికి రీజ‌నుంది. పూరి జ‌గ‌న్నాథ్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే పోకిరి, బిజినెస్‌మెన్ సినిమాలు వ‌చ్చి హిట్ అయ్యాయి. త‌రువాత జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా చేద్దామ‌ని క‌థ రెడి చేశాడ‌ట పూరి. మ‌హేష్ బాబు కూడా క‌థ విన్నాడ‌ట‌. కానీ ఇంత‌లో పూరికి వ‌రుస ప్లాప్‌లు రావ‌డం, మ‌హేష్ జ‌న‌గ‌న‌మ‌ణ‌కు మంగ‌ళం పాడటం జ‌రిగిపోయాయి. ఇప్పుడు పూరి ట్రాక్‌లోకి వ‌చ్చాడు.. కానీ మ‌హేష్‌బాబు నుంచి జ‌న‌గ‌ణ‌మ‌ణ విజ‌య్ దేవ‌ర‌కొండ ఎగురేసుకుపోయే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇప్పుడు మ‌హేష్‌బాబు కోసం త‌యారు చేసిన జ‌న‌గ‌ణ‌మ‌ణ సినిమాను విజ‌య్ దేవ‌రకొండ‌తో చేసేందుకు పూరి సిద్ద‌మ‌య్యాడ‌ట‌. సో త్వ‌ర‌లో జ‌న‌గ‌ణ‌మ‌ణ పాడేది మ‌హేషా…? లేక విజ‌యా…? త‌్వ‌ర‌లో తేల‌నున్న‌ది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news