మహర్షి డైరక్టర్ కు మరో లక్కీ ఛాన్స్…!

81

సూపర్ స్టార్ మహేష్ ల్యాండ్ మార్క్ మూవీ 25వ సినిమా మహర్షిని తీసి హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి హిట్టు కొట్టడమే ఆలస్యం మరో సూపర్ ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. మహర్షి నిర్మాతలు దిల్ రాజు, పివిపి మళ్లీ వంశీ పైడిపల్లితోనే సినిమా తీయాలని చూస్తున్నారట. మహర్షి సినిమాతో సత్తా చాటిన వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్ తోనే సినిమా చేస్తాడా లేక మరో స్టార్ తో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.

తన మొదటి సినిమా నుండి దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి మహర్షి సినిమాతో మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. మహర్షి దర్శకుడిగా హిట్టు కొట్టడమే కాదు గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు వంశీ పైడిపల్లి. అందుకే అతనికి మళ్లీ మరో ఛాన్స్ ఇచ్చారు. వంశీ నెక్స్ట్ సినిమా నిర్మాతలుగా దిల్ రాజు, పివిపి వ్యవహరిస్తారు. ఈ సినిమాకు గాను అడ్వాన్స్ గా 3 కోట్లు ఇచ్చినట్టు టాక్.

మొత్తానికి సూపర్ స్టార్ సినిమా సూపర్ హిట్ తో వంశీ పైడిపల్లి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. చూస్తుంటే వంశీ పైడిపల్లి మరో సెన్సేషనల్ డైరక్టర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊపిరి తర్వాత 3 ఏళ్లు టైం తీసుకున్న వంశీ పైడిపల్లి అందుకు తగినట్టుగానే ఆఫర్లు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు.

Leave a comment