వసూళ్ల సునామి సృష్టిస్తున్న మహానటి..!

mahanati-collections

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా స్టార్ సినిమాల రేంజ్ కలక్షన్స్ తో దుమ్ముదులిపేస్తుంది. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండి సూపర్ మౌత్ టాక్ తో దూసుకెళ్తున్న మహానటి ఏరియాల వైజ్ గా సూపర్ కలక్షన్స్ రాబడుతుంది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమా 1.9 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. దగ్గరదగ్గరగా 2 మిలియన్ కు చేరుకున్నట్టే లెక్క. యూఎస్ బాక్సాఫీస్ పై సత్తా చాటి హయ్యెస్ట్ గ్రాసర్స్ లో 11వ స్థానంలో నిలిచింది మహానటి మూవీ.

ఇక ఏరియాల వైజ్ తెలుగు రెండు రాష్ట్రాల్లో మహానటి కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం 4.85 కోట్లు
సీడెడ్ 0.93 కోట్లు
ఉత్తరాంధ్ర 1.34 కోట్లు
గుంటూరు 0.83 కోట్లు
ఈస్ట్ 0.76 కోట్లు
వెస్ట్ 0.52 కోట్లు
కృష్ణా 1.03 కోట్లు
నెల్లూరు 0.26 కోట్లు
ఏపి/ తెలంగాణా 10.52 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 కోట్లు
ఓవర్సీస్ 7.50 కోట్లు

వరల్డ్ వైడ్ కలక్షన్స్ 19.62 కోట్లు

వారంలో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టి ఇంకా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది మహానటి మూవీ.

Leave a comment