Newsముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి : కొరటాల శివ

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి : కొరటాల శివ

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు తర్వాత రాబోతున్న సినిమా భరత్ అనే నేను. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే ఇదివరకు సిఎం పాత్రలతో వచ్చిన సినిమాల్లో ప్రస్తుత రాజకీయాల మీద ఓ సెటైర్ వేయడమో లేక వేలెత్తి చూపించడమో చేసేవారు. అలా కూడా జనాకర్షణ లభించిందని చెప్పాలి.

ఇక ప్రస్తుతం భరత్ అను నేను సినిమాలో సిఎం చాలా కొత్తగా ఉండబోతున్నాడట. ఖచ్చితంగా ఈ సిఎం ప్రజల మనసులను గెలుచుకుంటాడని అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రత్యేకంగా సినిమాలో కొన్ని కొత్త పాయింట్లతో అసలు సిఎం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనే రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారట. శ్రీమంతుడులో ఊరి దత్తత కాన్సెప్ట్ చెప్పిన కొరటాల శివ మీద నమ్మకం ఉంచి సినిమా చేసిన మహేష్ అంతకుమించి హిట్ కొట్టడమే కాదు ప్రశంసలు అందుకున్నారు.

ఇక ఇప్పుడు మరోసారి కొరటాల శివ మీద అదే నమ్మకంతో భరత్ అను నేను సినిమాలో సిఎంగా చేస్తున్నారు. ఇక మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కు సిద్ధమవుతుంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news