మొదటిది రాకముందే రెండో దాని పై మోజు..!

kalynadev-2nd-movie-details

‘కళ్యాణ్ దేవ్’ మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ దేవ్ “విజేత” సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన అలనాటి హిట్ చిత్రం ‘విజేత’ మూవీ టైటిల్ నే ఈ సినిమాకి కూడా టైటిల్ గ పెట్టినట్లు తెలుస్తుంది. రాకేశ్‌ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.
వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్‌ విజేత లో హీరోయిన్ గా నటించింది. విజేత చిత్త్రం జులై మొదటివారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విడుదల కాకముందే తన రెండో సినిమాని కూడా ప్రారంభించే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల గుసగుసలు.
కళ్యాణ్ దేవ్ తదుపరి చిత్రానికి “వరప్రసాద్‌ గారి అల్లుడు” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమాకి చిరంజీవి హిట్ సినిమా టైటిల్ పెట్టుకోగా రెండో సినిమాకి చిరంజీవి అసలు పేరైన
‘వర ప్రసాద్’ ను తన సినిమా టైటిల్ గ పెట్టుకునే ఆలోచనలో కళ్యాణ్ దేవ్ ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ రెండో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కళ్యాణ్ వింటున్నారట.కళ్యాణ్ దేవ్ కు మెగాస్టార్ టైటిల్ సెంటిమెంట్స్ ఎంత వరకు కలిసి వస్తాయో విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Leave a comment