Gossips150 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అనిపించుకున్న సినిమా..!

150 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అనిపించుకున్న సినిమా..!

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అంటే వసూళ్ల హంగామా సృష్టించడం ఖాయం. బాక్సాఫీస్ షేక్ చేసే కలక్షన్స్ తో రజిని సినిమా రచ్చ చేస్తుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాటే రజిని సినిమా కలక్షన్స్ కు కొదవలేదని ఒకప్పుడు చెప్పుకునే వాళ్లం తెలుగు స్టార్ హీరోలకు ధీటుగా సినిమా వసూళ్లను రాబడుతూ తమిళంలో తెలుగులో ఒకేరకమైన సినిమా ఫలితాలను అందుకుంటాడు రజిని.

కాని పరిస్థితులు మారాయి.. రజిని మార్కెట్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా లింగా, కబాలి తర్వాత రజిని సినిమా అంటే భయపడేలా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ అయినా సరే కాలాగా రికార్డులను సృష్టించడం ఖాయం అనుకోగా మళ్లీ కాలా కూడా వారికి కన్నీళ్లు మిగిల్చింది. పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసినా సరే డిజాస్టర్ అనాల్సిందే.

రజిని మీద ఉన్న మార్కెట్ స్ట్రాటజీతో ఈ సినిమాను లెక్కకు మించి అమ్మేశారు. అయితే ఫలితం తేడా కొట్టడంతో 150 కోట్లు వచ్చినా ఫ్లాప్ అనేస్తున్నారు. తెలుగులో అయితే కాలా 30 కోట్లతో రైట్స్ పొందగా కేవలం 7.5 కోట్లను మాత్రమే రాబట్టింది. రజిని మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నది అని చెప్పడానికి ఈ సినిమా ఫలితాలు చూస్తే సరిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news