బాబు అవినీతి పాలనకు బుద్ధి చెప్పండి… మోసానికి వ్యతిరేకంగా ఓటు : వైఎస్ జగన్

jagan speech at nandhyala elections

అవినీతి సొమ్ముతో గెలవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు నంద్యాల ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలో ఏడవరోజు పర్యటించారు. మూలసాగరంలో వైయస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలి అన్నారని, అయితే… బాబు ముఖ్యమంత్రి అయి మూడున్నరేళ్లు గడిచినా ఒక్కరికీ జాబు రాలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలన్నారు.

ఎన్నికల గెలుపు కోసం ఓటరుకు రూ.5వేలు ఇచ్చి దేవుడి పటంపై ప్రమాణం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆయన మనుషుల పట్ల ఓటర్లు లౌక్యంగా వ్యవహరించాలని కోరారు. ఆ సందర్భంలో దేవుణ్ని స్మరించుకుని లౌక్యంగా వ్యవహరించాలని, ధర్మానికి మాత్రమే ఓటు వేయాలని, న్యాయాన్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనకు వ్యతిరేకంగా ఈ ఓటు ఉండాలని, చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.

Leave a comment