మ‌రిదితో వ‌దిన ఎఫైర్‌… ద‌ర్శ‌కుడికి హీరోయిన్ వార్నింగ్‌..

2

సీనియర్ హీరోయిన్ సంగీతను గుర్తు పట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా లైమ్‌టైమ్‌లోకి వచ్చిన సంగీత ఆ తర్వాత శ్రీకాంత్, వేణులాంటి హీరోలతో కూడా నటించింది. రవితేజతో కూడా హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన పలు సంచలన విషయాలు బయట పెట్టింది. తమది సినిమా ఫ్యామిలీ అని చెప్పిన సంగీత… తన తాత పెద్ద నిర్మాత అని తమిళంలో 20 సినిమాలు నిర్మించాడ‌ని కూడా చెప్పింది.

తాను సినిమా రంగంలోకి రావడానికి ప్రధాన కారణం తన తల్లి అని చెప్పిన సంగీత… సినిమాల్లోకి రాకపోయి ఉంటే తను విదేశాల్లో సెటిల్ అయిపోయిందని చెప్పుకు వచ్చింది. ఇక హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చినా ముందుగా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చింది. సినిమా రంగంలో ఉన్న చీకటి కోణాన్ని చూపించే పాత్ర కావడం.. ఆ పాత్రలో సంగీత ఒదిగిపోయి నటించడంతో ఆ పాత్ర తెలుగు సినిమా చరిత్రలో హీరోయిన్ల పరంగా చూస్తే మంచి పాత్ర గా మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే గతంలో ఓ తమిళ దర్శకుడు ఒక వదిన మరిది మీద కన్నేసి అతడితో ఎఫైర్ పెట్టుకునే కథతో సంగీతం దగ్గరకు వచ్చాడట. ఇలాంటి అక్రమ సంబంధాల కథను తాను చేయ‌న‌ని దర్శకుడు చెడామడా తిట్టి పంపించానని సంగీత చెప్పింది. ఇక అది రియల్ గా జరిగిన సంఘటన అని ఆ దర్శకుడు చెప్పే సరికి తను చాలా షాక్‌కు గుర‌య్యాయ్యానని కూడా ఆమె తెలిపింది. ఏదేమైనా సంగీత తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర ఉండేలా ఆమె పాత్రలు ఎంచుకుంది.

Leave a comment