గూఢచారి ఫస్ట్ డే కలక్షన్స్..!

15

అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ వచ్చిన సినిమా గూఢచారి. తెలుగులో వచ్చిన స్పై థ్రిల్లర్స్ లో ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. జేంస్ బాండ్ సినిమాలను ఇష్టపడే వారికి గూఢచారి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. గ్రిప్పింగ్ కథ, కథనాలతో సినిమా అంచనాలను అందుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ బాగా రాబట్టిందట.

మొదటి రోజు 50% ఆక్యుపెన్సీ దాకా రాబట్టిన ఈ సినిమా 1 కోటి దాకా రాబట్టిందట. సినిమా యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకోగా యూఎస్ లో 53000 ల డాలర్స్ వసూళు చేసింది. చూస్తుంటే గూఢచారి ఓవర్సీస్ ఆడియెన్స్ ను మెప్పించిందని చెప్పొచ్చు. టాక్ బాగుంది కాబట్టి సినిమా వీకెండ్ లో బాగానే వసూళు చేసే అవకాశం ఉంది. అడివి శేష్ కథ, కథనాలు అందించిన ఈ సినిమా పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ గా వచ్చింది. మరి ఈ సినిమా కలక్షన్స్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a comment