Moviesగోపిచంద్ 'పంతం' రివ్యూ & రేటింగ్

గోపిచంద్ ‘పంతం’ రివ్యూ & రేటింగ్

తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మళ్లీ ఆ క్రేజ్ తో హీరోగా ప్రమోట్ అయిన గోపిచంద్ మాస్ ఇమేజ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా హిట్ సినిమా అందని ద్రాక్షగా ఉంటున్న గోపిచంద్ పంతంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చక్రవర్తి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మించారు. గోపిచంద్ 25వ సినిమాగా వస్తున్న ఈ పంతంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. గోపిచంద్ హిట్ కలని నిజం చేసిందో లేదో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

విక్రాంత్ (గోపిచంద్) ఓ తెలివైన కుర్రాడు. ఓ గ్యాంగ్ ను వేసుకుని రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా పొలిటికల్ లీడర్స్ అందరిని చుట్టేసిన విక్రాంత్ ఫైనల్ గా హోం మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో కూడా చోరీ చేస్తారు. హోం మినిస్టర్ కాబట్టి పోలీసులు ఆ దొంగతనం ఎలా జరిగిందని కనిపెట్టే క్రమంలో విక్రాంత్ గ్యాంగ్ లోని కొందరిని పట్టుకుంటారు. ఇక వారి కోసం నాయక్ దగ్గరకు వచ్చిన విక్రాంత్ ను చూసి షాక్ అవుతాడు నాయక్. అసలు విక్రాంత్ కేవలం రాజకీయ నాయకులనే ఎందుకు టార్గెట్ చేశాడు..? అతనికి పొలిటికల్ లీడర్స్ మీద ఉన్న కసి ఏంటి..? ఫైనల్ గా విక్రాంత్ ఏం చేశాడన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో విక్రాంత్ పాత్రలో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గోపిచంద్. చాలా రోజుల తర్వాత గోపిచంద్ లో కామిక్ సెన్స్ చూసినట్టు అనిపిస్తుంది. డైలాగ్స్, ఫైట్స్ విషయంలో ఆయన గోపి సత్తా చాటాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కూడా బాగానే చేసింది. అయితే సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అని చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి, పృధ్విల కామెడీ ఆకట్టుకుంది. ఇక జయప్రకాశ్ రెడ్డి, షియాజి శిండే, తణికెళ్ల భరణి ఎప్పటిలానే తమ పాత్రలతో ఆకట్టుకోగా విలన్ గా సంపత్ మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమాలోని సాంగ్స్ అసలు ఏమాత్రం బాగాలేవు. గోపిసుందర్ ఈమధ్య తన రేంజ్ మ్యూజిక్ అందించడంలో విఫలమవుతున్నాడు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త కట్ చేయాల్సిందని అనిపిస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు చక్రి మొదటి సినిమానే అయినా టాలెంట్ చూపించాడు. కాని ఇంకా స్క్రిప్ట్ మీద ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేదని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

మాస్, కామెడీ, ఫ్యామిలీ ఇలాంటి జానర్ లను కవర్ చేస్తూ గోపిచంద్ చేస్తున్న సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ మీద ప్రభావం చూపట్లేదు. అందుకే గోపిచంద్ మరోసారి తన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ పంతం చేశాడు. తన వరకు ఈ సినిమా బెస్ట్ అనిపించుకున్నాడని చెప్పొచ్చు.

కథ మరి కొత్తగా అనిపించకపోయినా కథనం నడిపించిన తీరు బాగానే అనిపిస్తుంది. మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే అదే విధంగా సెకండ్ హాఫ్ కొనసాగించలేదు. రెండో భాగం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది.

కథలో అనవసరమైన సన్నివేశాలు చేర్చి ఇంకాస్త సాగదీసినట్టు చేశాడు దర్శకుడు. ఎంచుకున్న కథను కమర్షియల్ పంథాలో చెప్పాలన్న ఆలోచనతో అలా చేసి ఉండొచ్చు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడియెన్స్ ను అలరిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

గోపిచంద్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

అనవసర సన్నివేశాలు

బాటం లైన్ :

గోపిచంద్ ను నిలబెట్టిన ‘పంతం’..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news