బాలయ్య ప్లేసును కబ్జా చేస్తున్న తారక్.. పండగ చేసుకుంటున్న నందమూరి ఫ్యాన్స్!

27

తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో చెలరేగి నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో నటించేందుకు వివిధ స్టార్ క్యాస్టంగ్‌ను సెలెక్ట్ చేస్తున్నాడు బాలయ్య.

కాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశం చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే ఈ పాత్రకు ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. బాలయ్య బాబులోని డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లు కేవలం తారక్ మాత్రమే చేయగలడు అని వారు అంటున్నారు. దీంతో బాలయ్య పాత్రలో తారక్ నటిస్తే ఆ బొమ్మ ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నారు.

ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌ను సతమత పెడుతున్న ఈ విషయం ఒకవేళ నిజం అయితే మాత్రం వారి ఆనందానికి అవధులు లేకుండా పోవడం ఖాయం. మరి నందమూరి ఫ్యాన్స్ కలను బాలయ్య నిజం చేస్తాడా లేడా అనేది చూడాలి.

Leave a comment